స్థలం: బెంగళూరు మల్లేశ్వరం సర్కిల్ దగ్గరలో ఉన్న ఒక సైబర్ కేఫ్.
తేది: 26 సెప్టెంబర్ 2006.
సమయం: మధ్యాహ్నం 3.30 నిమిషాలు.
2006 సంవత్సరం జూన్లో ఇంజనీరింగ్ పట్టబద్రుడనై ఉద్యోగమో రామచంద్రా అంటూ అలమటిస్తున్న ఆ రోజు, నా జీ-మెయిలు ఇన్బాక్సు కు ఒక e-mail వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే 28 సెప్టెంబర్ 2006 తేదిన HCL అనబడే ఒక software కర్మాగారంలో 2006 వ సంవత్సరంలో దేశం మీద పడిన నిరుద్యోగులకు వ్రాత పరీక్ష ఉందని అందులో క్రుతార్దులైతే మౌఖిక పరిక్ష ఉంటుందని.
సరే మన దురదృష్టాన్ని ఇంకో సారి పరీక్షించుకుందామని డిసైడ్ అయ్యాను. యదా ప్రకారం సంజీవ్ గాడికి 1000/- టెండర్ పెట్టాను. వాడికి నా కన్నా ముందర ఉద్యోగం రావడంతో వాడే నా పాలిట కామధేనువు, కల్పవృక్షం & ATM అన్నమాట. వాడు 1000/- టెండర్ ఖరారు చేసాడు. మరుసటి రోజే చెన్న పట్టణానికి ప్రయాణం. చెన్న పట్టణం ఎలా ఉంటుందో అని వూహించుకుంటూ నిద్ర లోకి జారుకున్న.
మరుసటి రోజు నిద్ర ఆలస్యంగా లేవడంతో చెన్నైకి వెళ్ళే మొదటి ట్రైను మిస్సు. ఆది లోనే హంసపాదు. మెల్లగా కాళ్ళు ఈడ్చుకుంటూ కెంపె గౌడ బస్ నిల్దాణ(Majestic) కి వెళ్ళాను. అక్కడ అప్పుడే బయల్దేరబోతున్న తమిళనాడు బస్సు ఎక్కి, టిక్కెట్టు వ్యవహారం పూర్తి ఐన తర్వాత, కండక్టరు కి నేను వెళ్ళాల్సిన అడ్రస్ చూపించా. అతను ఆ అడ్రస్ కి వెళ్ళాలంటే బస్సు స్టాండ్ దాక వెల్లకర్లేదని మధ్యలోనే Poonamalle అనే ప్రదేశంలోనే దిగిపొమ్మని చెప్పాడు.
కొంచం సేపు అయిన తర్వాత ఒక ఆరవ సినిమా మొదలెట్టారు. ఆ సినిమా చూసిన తర్వతా కధకమామీషు అర్థం కాకపోఇన అరవంలో చెల్లల్ని తన్గచ్చి అంటారని అర్ధమైంది. అప్పుడే ఒక ఆరవ పదం నేర్చుకున్నామని నాకు నేనే భుజం తట్టుకున్నా.
ఇంతలొ చిత్తూరు జిల్లా పలమనేరులో భోజన విరామం. అక్కడ హోటల్ లో అదో రకమైన తెలుగు యాసలో మధ్యలో ఆరవ పదాలు కలిపి మాట్లాడుతున్నారు. మొత్తానికి అక్కడ ఒక విజయవాడ సర్వర్ వుండటంతో అతని దయవల్ల భోజనం ముగించా.
కొన్ని గంటల తర్వాత కండక్టరు వచ్చి నేను దిగవలసిన Poonamalle అనే ప్రదేశం వచ్చిందని అక్కడి నుంచి Vadapalani ఈజీ గ వెళ్ళవచ్చు అని దింపేసాడు. ఇప్పటికీ ఆ కండక్టరు గుర్తుకొచ్చినప్పుడల్లా మనసులోనే తిట్టుకుంటూ వుంటాను. Koyambedu నుంచి ఈజీగా వెళ్ళే Vadapalani కి Poonamalle దగ్గర దింపి కష్టాలకు గురిచేశాడు అని.
Poonamalle దగ్గర దిగిన నేను అందరిని అడుగుతూ బస్సు స్టాండుకి చేరుకున్నాను. అక్కడ బస్సులు చూస్తే గుంటూరు, బందరులో చూసిన డొక్కు డోలు ప్రైవేట్ బస్సులు గుర్తొచ్చాయి. అక్కడ ఉన్న కండక్టర్ని ఆంగ్లంలో అభ్యర్దిశ్తే 25G అనబడే బస్సు Vadapalani వెళ్తుందని సెలవిచ్చాడు.
అప్పటికే ముందు సీట్లన్నీ నిండిపోవటంతో వెళ్లి చివర సీట్లో ఒక అబ్బాయి పక్కన కూలబడ్డా. బస్సు మొత్తానికి కదిలింది, Vadapalani టిక్కెట్టు తీసి, కండుక్టర్కి నేను వెళ్ళాల్సిన అడ్రస్ చూపిస్తే, స్టాపు రాగానే చెబుతాన్నాడు. కొంచం సేపటికి నల్లగా లావుగా ఉన్న ఇద్దరు స్త్రీలు వచ్చి నామీద ఏదో అరుస్తున్నారు. నాకు అర్ధంకాక "Pardon me" అని ఆంగ్లంలో అభ్యర్దిస్తే ఇంకా అరుపులు పెద్దవి చేసారు. ఇంతలో, పక్కన వున్న ఉత్తర భారతదేశం కుర్రాడు వెనుక సీట్ స్త్రీలది అని నన్ను లేవమని హిందీలో సెలవిచ్చాడు. మొత్తానికి వాళ్ల ఆక్రోసానికి కారణం తెలిసి నేను అతను వాళ్ళకి సీటు ఇచ్చాము.
మనసులో ఒక పక్క ఆందోళన, ఇంకా మనము దిగాల్సిన స్టాపు రాలేదు ఏమిటి అని. ఆ బస్సు కండక్టరు ఏమో Poonamalle నుంచి Vadapalani దగ్గర అన్నాడు కాని ఇంకా స్టాపు రాలేదు. ఒక 45 నిమిషాల తర్వాత సిటి బస్సు కండక్టరు వచ్చి నేను దిగాల్సిన స్టాప్ వచ్చిందని అరవంలో చెప్పాడు.
బస్సు దిగి మా ఇంటి ఓనరు కొడుక్కి ఫోన్ చేశాను. రెండు మూడు ఫోన్ కాల్స్ తర్వాత 12 వ ఫ్లోర్ లో ఉన్న అతని ఇంటికి వెళ్లి కూలబడ్డా. కుశల ప్రశ్నలు అవి అయిన తరువాత మరుసటి రోజు పరీక్షకు చదవడం మొదలెట్టా. తరువాత సైబర్ కేఫుకి వెళ్లి ఆహ్వాన పత్రాన్ని అచ్చు వేఇంచా. తదనంతరం తిండి ముగించాక మరుసటి రోజు పరీక్ష గురించి కలలు కంటూ నిద్రకు ఉపక్రమించా. బెంగళూరు వాతావరణం అలవాటు అవ్వడం వలన, బాగా వేడి అనిపించి నిద్ర సరిగ్గా పట్టలా.
(సశేషం)
Read more...